
బాలీవుడ్ దర్శక నిర్మాత ఓ ఆసక్తికరమైన సినిమాను ప్రకటించారు. తన బ్యానర్ లో రూపొంది ఘనవిజయం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సీక్వల్ గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తెరకెక్కనున్నట్టుగా ప్రకటించిన కరణ్, హీరో టైగర్ ష్రాఫ్ తో టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపించనున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పరిచయం అవుతుందన్న ప్రచారం జరిగింది. తరువాత సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ పేరును కూడా పరిశీలించారు. అయితే వీరిద్దరు ప్రస్తుతం తొలి సినిమాలతో బిజీగా కావటంతో మరో స్టార్ వారసురాలు అనన్య పాండే పేరును పరిశీలిస్తున్నారట. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చుంకీ పాండే కూతురు అనన్యకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందే. అందుకే ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే సినిమా ప్రమోషన్ విషయంలో కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment