జస్ట్‌ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్‌ | How To Make Dosakaya Pachadi Golmaal Actor Ashwini Kalsekar recipe | Sakshi
Sakshi News home page

జస్ట్‌ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్‌

Mar 24 2026 3:07 PM | Updated on Mar 24 2026 3:20 PM

How To Make Dosakaya Pachadi Golmaal Actor Ashwini Kalsekar recipe

ప్రముఖ బాలీవుడ్‌ నటిఅశ్విని కల్సేకర్‌ దోసకాయపచ్చడి తయారు చేసి చూపించారు. అదీ జస్ట్‌ నిమిషాల్లోనే అంటూ ఆమె చేసిన పోస్ట్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అశ్విని కల్సేకర్ మరెవ్వరో కాదు ప్రముఖ నటుడు మురళి శర్మ భార్య.  పదండి మరి కమ్మని దోసకాయ పచ్చడి మేకింగ్‌ కథ ఏంటో తెలుసుకుందాం.

గోల్‌మాల్‌  అంధాధున్, జోధా అక్బర్ లాంటి పాపులర్‌ మూవీలు, టీవీ షోలతో  తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్ నటి అశ్విని కల్సేకర్. తరచుగా సోషల్ మీడియాలో పలు వంటల గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా  నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిన వీడియో వైరల్‌గా మారింది.

దోసకాయ పచ్చడి రెసిపీ 
ఈ సాంప్రదాయ ఆంధ్ర-శైలి చట్నీ  పుల్ల పుల్లగా, పంటి కింద పచ్చదోసకాయ ముక్కలు తగులుతూ ఉండే రుచిని అందరూ  ఇష్టపడతారు. దీనిని సాంప్రదాయకంగా పసుపు దోసకాయ (దోసకాయ), కొత్తిమరీ, చింతపండు , వేయించిన  దినుసులతో తయారు చేస్తారు.

ఇదీ చదవండి: 45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్

అశ్విని షేర్‌ చేసినరెసిపీ : ముందుగా దోసకాయ తొక్క తీసి, గింజలు తొలగించి (కొంతమంది గింజలు వేసుకుంటారు), చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, 2 టేబుల్ స్పూన్ల మినప పప్పు వేసి, ఎర్రగా వేగాక, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు,  ఎండు,  పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని ఇంగువ వేసి వేయించాలి. ఆ తరువాత స్టఫ్‌ ఆఫ్‌ చేసి, ఈ పోపులోనే కొద్దిగా చింతపండు గుజ్జు , ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కన  పెట్టి చల్లారనివ్వాలి.

తరువాత కొత్తి మీర, దోసకాయ ముక్కల్ని పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా  ఉండేలా మిక్సీ పట్టాలి. అంతే ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోవడమే. ఈ చట్నీని అన్నం, రోటీతో గానీ ఆస్వాదించవచ్చు అంతకు ముందు  కూడా అశ్విని  అన్నం లేదా పూరీతో కలిపి తినే,, కొంకణి శైలి బంగాళదుంప కూర అంబట్ బటాటా రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.థ

ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

Advertisement
 
Advertisement
Advertisement