బిపాసా కోసమేనా!
క్యూట్ గాల్ త్రిషాకు రానా కట్ చెప్పడానికి కారణం... మనోడి మనసులో మరొకరు ఉండటమేనట. అదీ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ బిపాసాబసు అని ఇండస్ట్రీలో టాక్. ఆమెకు దగ్గరయ్యేందుకే ఈమెను దూరం పెట్టాడట. ఓ పక్క త్రిషా కూడా ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ దాకా వెళ్లిందనేది శాండల్‌వుడ్‌లో రూమర్. ఏది ఏమైనా... అలా బ్రేకప్ అవగానే ఇద్దరూ ఇలా ఎవరికి వారు ఎంగేజ్ అయిపోయారు. మరోవైపు ఇప్పటి వరకు హర్మాన్ బవేచాతో రొమాన్స్‌లో మునిగితేలిన బిపాసా కూడా.. అతడిని వదులుకోగానే ఈ టాలీవుడ్ కండల కుర్రాడిని పట్టేసి బిజీ అయిపోయింది.