ప్రతీకాత్మక చిత్రం
కొన్ని సందర్భాల్లో మనం చెడు అనుకున్నది కూడా మంచి చేస్తుంది. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన విషయాల్లో. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావటం, విడిపోవటం సాధారణంగా జరుగుతుంటుంది. అలాంటి సమయాల్లో కొంతమంది జీవితమే పోయినట్లుగా బాధపడుతూ ఉంటారు. ప్రేమలో విఫలమవ్వడమంటే అది విషాదమైనది కాదు. బ్రేకప్ మనకు ప్రేమ, సంబంధాల గురించి ఎన్నో నేర్పుతుంది! విలువైన గుణపాఠాలను చెబుతుంది.
ప్రేమ చేసిన గాయంతో మనసు తీవ్రమైన బాధకు గురవుతుంది. దీంతో మనం ఆ బాధనుంచి బయటపడలేమన్న భ్రమ కలుగుతుంది. ప్రేమ వల్ల అయిన గాయానికి కాలమే మందు రాస్తుంది. అనుభవం నేర్పిన పాఠాలే గుణపాఠాలై భవిష్యత్తులో తప్పటడుగులు వేయకుండా హెచ్చరిస్తాయి.
1) ఎదుటి వ్యక్తి తప్పొప్పులు
కూరిమి గల దినములలో నేరము లెన్నడు గలుగ నేరవు.. అన్నట్లు మనం లోతైన ప్రేమలో ఉన్నపుడు ఎదుటి వ్యక్తిలోని మంచి మాత్రమే మనకు కన్పిస్తుంది. అతడి తప్పులు కూడా ప్రేమ కారణంగా మనకు ఒప్పులుగానే కన్పిస్తాయి. ఆ వ్యక్తితో బ్రేకప్ అయినపుడు మాత్రమే అతడిలోని చెడు కోణం మన కంటికి కన్పిస్తుంది. అందుకే మన ప్రేమ ఎదుటి వ్యక్తి తాలూకు చెడు కోణాన్ని కప్పిపెట్టేలా ఉండకూడదు. అలా అని అదే పనిగా వారి చెడు లక్షణాలకు ఎత్తి చూపకూడదు.
2) సంకోచం పనికి రాదు
అన్ని ప్రేమ సంబంధాలు కలకాలం కలతలు లేకుండా సాగాలని రూలేమీ లేదు. తరుచూ భేదాభిప్రాయాలతో గొడవలు పడుతూ సర్దుకుపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పరిస్థితి మన చెయ్యి దాటి పోయినపుడు ప్రేమకు స్వప్తి పలకటం మన చేతిలో పని అని గుర్తించాలి.
3) అనుకూలత అన్ని వేళలా మంచిది కాదు
బంధాలు దీర్ఘకాలం కొనసాగాలంటే వ్యక్తులు ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని అనుకుంటాం. వ్యక్తుల మధ్య అనుకూలతలు అన్ని వేళలా మంచిది కాదని గుర్తించాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరంటేఒకరికి ఇష్టం ఉండి ఒకే రకమైన అలవాట్లు కూడా ఉన్నంత మాత్రాన బంధాలు కలకాలం నిలువవు. వ్యక్తిత్వాలలోని తేడాలు బంధాన్ని నాశనం చేయోచ్చు. రెండు వేరువేరు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు కలిసుండటమన్నది కష్టతరమైన పని. ఒకరు ఇంట్రావర్ట్, మరొకరు ఎక్స్‌ట్రావర్ట్ అయితే ఆ బంధాన్ని నిలుపుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
4) బంధంలో మూడో వ్యక్తి
బంధంలో మూడో వ్యక్తి ప్రస్తావన ఎప్పుడైతే మొదలవుతుందో ఆ బంధం మెల్లమెల్లగా బీటలు బారుతుంది. ఉదాహరణకు: రాజేష్, లతలు ప్రేమించుకుంటున్నారని అనుకుందాం. కొద్ది రోజుల తర్వాత రాజేష్ మరో అమ్మాయితో ప్రేమలో పడితే! ఆ బంధం పరిస్థితి ఊహాతీతం. బంధంలో ఉన్నపుడు తరుచు మూడో వ్యక్తి ప్రస్తావన రావటం కలహాలకు దారి తీస్తుంది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment