నటి అంకిత లోఖండే, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ సందర్భంగా ప్రారంభమైన వీరి బంధం ఆ తర్వాత విబేధాలు రావడంతో ముగిసిపోయింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా వెబ్‌సైట్ సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకిత, కుశాల్ టాండన్ అనే నటుడితో కొన్నాళ్లు డేటింగ్ చేసిందంటూ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్తా హాట్ టాపిక్‌గా మారడంతో కుశాల్ టాండన్ దీనిపై స్పందించారు. సదరు వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ తనకు అన్నలాంటి వాడని.. అంకిత మంచి స్నేహితురాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ ట్వీట్ చేశారు. (చదవండి: ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత)
This is a shame journalism, like really , I was a friend of both ,Sushanth was a brother and @anky1912 a friend , at this time who so ever z team is trying to get my name in this blame game ... plz keep me out of this ....... 😡😡😡😡😡shocking how we live in a world of news 🙏 pic.twitter.com/B65xy737KR
— KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020
‘నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది జర్నలిజమా.. నేను.. సుశాంత్, అంకితలకు మంచి స్నేహితుడిని. తను నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్ అవుతున్నాను’ అంటూ కుశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే సుశాంత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలపై కూడా స్పందించారు. సుశాంత్ మృతిని సర్కస్‌లా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుశాల్ టాండన్. ‘ప్రపంచమా.. దయచేసి తన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ జరుగుతున్న సర్కస్‌ని చూసి స్వర్గంలో ఉన్న ఆ వజ్రం గట్టిగా నవ్వుతుంది. సుశీ. ఎప్పటిలానే వీటన్నింటిని లైట్ తీసుకో. చిల్ అవ్వు’ అంటూ మరో ట్వీట్ చేశారు కుశాల్ టాండన్. (చదవండి: సుశాంత్ ఇంటి ముందు ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరంటే!)
And for the world plz let his soul rest in peace 🙏it’s a circus 🎪 out here and the diamond must be laughing out loud from heaven ..... sushi take lite like u always did ❤️u chil it’s only caos down here 😇you angel 😇
— KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020
ఇక కుశాల్‌తో డేటింగ్ వార్తలపై అంకిత స్పందించారు. ‘ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే చాలు తను ఎవరితో డేటింగ్‌లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అందరికి ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాను. ఎవరితోనే డేటింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. సమయం అంతకన్నా లేదు. నా పని నాకు ముఖ్యం. ఇలాంటి వార్తలు చదివి.. స్పందించి.. వివరణ ఇవ్వడం కూడా దండగ’ అన్నారు అంకిత.
Comments
Please login to add a commentAdd a comment