Is Actor Keith Powers And Ryan Destiny Breakup After 4 Years Relationship - Sakshi
Sakshi News home page

Keith Powers Breakup: బ్రేక‌ప్ దిశ‌గా స్టార్ జంట‌, నాలుగేళ్ల ల‌వ్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌!

Published Wed, Jan 19 2022 11:00 AM | Last Updated on Wed, Jan 19 2022 12:04 PM

Is Actor Keith Powers And Ryan Destiny Breakup After 4 Years Relationship - Sakshi

Keith Powers And Ryan Destiny Breakup: ప్రేమ పుట్ట‌డానికి క్ష‌ణం చాలంటారు.. కానీ ఆ ప్రేమ‌ను క‌ల‌కాలం నిలుపుకోవ‌డం క‌ష్ట‌మేనంటున్నారు ప‌లువురు సెల‌బ్రిటీలు. అందుకే కొంద‌రు ప్రేమ‌లో ఉండ‌గానే బ్రేక‌ప్ చెప్పుకుంటుంటే మ‌రికొంద‌రు పెళ్లై పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కూడా విడిపోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. తాజాగా మ‌రో స్టార్ జంట బ్రేక‌ప్ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అమెరిక‌న్ న‌టుడు కెత్ ప‌వ‌ర్స్, ర్యాన్ డెస్టినీ విడిపోవ‌డానికి నిశ్చ‌యించుకున్న‌ట్లు వారి స‌న్నిహితులు మీడియాతో వెల్లడించార‌ట‌.

నాలుగేళ్ల ల‌వ్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి రెడీ అయ్యార‌ట‌. కెరీర్ మీద ఫోక‌స్ పెట్టాల‌ని భావించిన ఆ ఇద్ద‌రూ.. ప్రేమికులుగా విడిపోయి స్నేహితులుగా క‌లిసుందామ‌ని నిర్ణ‌యించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని వారు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. కాగా ప‌వ‌ర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం కానున్న 'ద అగ్లీస్‌', 'ప‌ర్‌ఫెక్ట్ ఫైండ్' సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. సింగ‌ర్‌, న‌టి ర్యాన్‌ డెస్టినీ ప్ర‌స్తుతం బారీ జెన్‌కిన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 'ఫ్లింట్ స్ట్రాంగ్' సినిమాలో న‌టిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement