Jason Momoa Announce Separation With His Wife Lisa Bonet After 16 Years - Sakshi
Sakshi News home page

Jason Momoa: 16 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన నటుడు

Published Thu, Jan 13 2022 5:57 PM | Last Updated on Thu, Jan 13 2022 6:32 PM

Jason Momoa Announce Separation With His Wife Lisa Bonet After 16 Years - Sakshi

హాలీవుడ్‌ నటుడు, ఆక్వామెన్‌ స్టార్‌ జాసన్‌ మొమోవా భార్య లీసా బోనెట్‌తో తెగతెంపులు చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ విడిపోతున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో వేదికగా గురువారం వెల్లడించారు. 'కాలంతో పాటు వస్తున్న మార్పులను మనమంతా అనుభవిస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురుచూశాం. అందుకు నా కుటుంబం అతీతమేమీ కాదు. మేమిద్దరం విడిపోతున్నాం. కానీ మా మధ్య ప్రేమ అలాగే కొనసాగుతుంది. అది వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందుతుంది. పిల్లల బాధ్యతను ఇద్దరమూ చూసుకుంటాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు.

కాగా జాసన్‌, లీసా 2005 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరికి 2007లో లోలా, 2008లో నకోకా వోల్ఫ్‌ అని ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత 2017 అక్టోబర్‌లో జాసన్‌, లీసా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా వుంటే జాసన్‌ మొమోవా.. ఆక్వామెన్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, డ్యూన్‌ వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అతడు జేమ్స్‌ వాన్‌ డైరెక్ట్‌ చేసిన 'ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. లీసా పలు టీవీ షోలలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement