సింగిల్‌ లైఫే బాగుంది: ష్రాఫ్‌ | Krishna Shroff On Her Breakup With Eban Hyams | Sakshi

సింగిల్‌ లైఫే బాగుంది: ష్రాఫ్‌

Dec 23 2020 7:15 PM | Updated on Dec 23 2020 7:15 PM

Krishna Shroff On Her Breakup With Eban Hyams - Sakshi

అలా విడిపోయాం, కానీ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నా..

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కూతురు, హీరో టైగర్‌ ష్రాఫ్‌ సోదరి క్రిష్ణ ఇప్పుడిప్పుడే పాత జ్ఞాపకాలను మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ ఇబాన్‌ హయమ్స్‌కు దూరమైన తర్వాత తన జీవితం ఎలా సాగుతుందో చెప్తూ.. సింగిల్‌గా ఉండటమే అద్భుతంగా ఉందన్నారు. రిలేషన్‌షిప్‌లో లేకపోతేనే ఎలాంటి బాదరబంధీలు లేకుండా నాకోసం, నా బిజినెస్‌ కోసం ఫోకస్‌గా ఆలోచించగలుగుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇబాన్‌తో తెంచుకున్న బంధం గురించి మాట్లాడుతూ తమ దారులు వేరని అర్థమయ్యాయని, అందుకే ఇంకా రిలేషన్‌లో ఉండటం కన్నా స్నేహితుల్లా ఉందామని నిర్ణయించుకుని విడిపోయినట్లు తెలిపారు. మాజీ ప్రియుడితో టచ్‌లో ఉన్నానని, అతడితో మాట్లాడటానికి తనకేమీ ఇబ్బంది లేదని చెప్పారు. (చదవండి: బిగ్‌బాస్‌ : హారిక నా చెల్లి.. అభిజిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌)

కాగా క్రిష్ణ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటో వైరల్‌గా మారింది. అందులో ఆమె టర్కిష్‌ చెఫ్‌ సాల్ట్‌ బేను ముద్దాడింది. ఇది చూసి షాకైన ఇబాన్‌ 'ఇంత త్వరగా మూవ్‌ ఆన్‌ అయ్యావా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇప్పుడప్పుడే తనకు మళ్లీ డేటింగ్‌ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఎంజాయ్‌ చేస్తున్నానన్నారు. కాగా క్రిష్ణ, ఇబాన్‌ గతేడాది ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేటింగ్‌ చేసిన ఈ జంట గత నెలలో విడిపోయారు. అతడితో కలిసి దిగిన ఫొటోలను అన్నింటినీ క్రిష్ణ ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించారు. అభిమానులు కూడా తాము కలిసున్న ఫొటోలను షేర్‌ చేయొద్దని ఆమె అభ్యర్థించారు. (చదవండి: మరీ ఇంత త్వరగానా.. నాకైతే అంత తొందరేం లేదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement