లవ్‌ ఫెయిల్యూర్‌, చాలా బాధపడ్డా: అంజలి | Anjali About Breakup Love Story | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌ తట్టుకోవడం చాలా కష్టం: అంజలి

Apr 4 2021 4:28 PM | Updated on Apr 4 2021 7:32 PM

Anjali About Breakup Love Story - Sakshi

హీరోయిన్‌ అయినంత మాత్రాన తన మనసేమీ బండరాయి కాదని, ప్రేమ విఫలమైన బాధను భరించడం చాలా కష్టమని తెలిపింది.

బొద్దుగుమ్మలా ఉండే అంజలి ఈ మధ్య మరీ సన్నజాజిలా తయారైంది. ఒకప్పుడు తెలుగులోని స్టార్‌ హీరోలందరి సరసన నటించిన ఆమె ఇప్పుడు ఇతర భాషా చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. 'నిశ్శబ్దం' తర్వాత ఈ భామ తెలుగులో నటించిన తాజా చిత్రం 'వకీల్‌ సాబ్'‌. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె ప్రేమ, పెళ్లి గురించి స్పందించింది. కొన్నాళ్ల క్రితం తాను కూడా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింంది. అయితే ప్రేమలో పడిన మాట వాస్తవమని అంగీకరిస్తూనే కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌ అయినంత మాత్రాన తన మనసేమీ బండరాయి కాదని, ప్రేమ విఫలమైన బాధను భరించడం చాలా కష్టమని తెలిపింది. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానంటే అందుకు తనే తల్లే కారణమని చెప్పింది. ఎన్నో కష్టనష్టాలను భరించిన తల్లిని ఆదర్శంగా తీసుకునే దాన్ని అధిగమించానంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఏమీ ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. కాగా అంజలి ఇప్పటివరకు సుమారు 48 సినిమాల్లో నటించింది. తాజాగా వకీల్‌సాబ్‌తో పాటు తెలుగులో 'ఆనంద భైరవి' సినిమాలోనూ నటిస్తోంది. వీటితోపాటు మలయాళంలో 'భీష్మ పర్వం', కన్నడలో 'శివప్ప', తమిళంలో 'పూచండి' చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: ఏప్రిల్‌ 9న లంచ్, డిన్నర్‌ కలిసి చేద్దాం : దిల్‌ రాజు

సోషల్‌ హల్‌ చల్‌ : కన్నుగీటుతో కుర్రకారును కట్టిపడేస్తున్న మోనాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement