భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. తన భార్య హసిన్ జహాన్తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. ఇంకే ముంది కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరో వైపు మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు.