షమీ దుబాయి ఎందుకు వెళ్లాడు? | Why Did Shami Go To Dubai police Ask to BCCI | Sakshi
Sakshi News home page

షమీ దుబాయి ఎందుకు వెళ్లాడు?

Published Mon, Mar 12 2018 6:54 PM | Last Updated on Mon, Mar 12 2018 6:55 PM

Why Did Shami Go To Dubai police Ask to BCCI - Sakshi

కోల్‌కతా : భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమీ కేసు మరో మలుపు తిరిగింది. భార్య హాసిన్‌ జహాన్‌ సంచలన ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షమీ దుబాయ్‌ ఎందుకు వెళ్లాడని ఆరా తీయడంతో పాటు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ఏమైనా సహకరించాడా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనిలోభాగంగా షమీ దుబాయ్‌కు వెళ్లిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా అని పోలీసులు బీసీసీఐ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్‌ జహాన్‌  పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఇప్పటికే బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనాల  కాంట్రాక్ట్‌ కోల్పోయిన షమీ, ఐపీఎల్‌లోనూ ఆడటం అనుమానంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement