
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ లైంగిక వేధింపుల కేసు, అక్రమ సంబంధాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని బహిర్గతం చేసేముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పశ్చిమబెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించానని హసీన్ స్పష్టం చేసింది.
‘నా భర్త షమీ వ్యవహారాన్ని బయటపెట్టేముందు గంగూలీకి చెప్పా. ప్రధానంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే ముందు నేను సౌరవ్ సార్‌కి ఫోన్ చేసిన నా సమస్యను వివరించాను. షమీ తప్పుదారిలో నడుస్తున్నాడని, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయనకు చెప్పాను. ఆ తర్వాత ఆయన నాకు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆయన ఫోన్ కోసం నేను ఎదురుచూస్తున్నా. ఇది వ్యక్తిగత విషయమని.. దీని గురించి ఆయన పట్టించుకోవడం లేదని అనుకుంటున్నా’ అని హసీన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment