
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇతర అమ్మాయిలతో అక్రమసంబంధాలు ఉన్నట్లు గతంలో ఆరోపణలు చేసిన జహాన్, తాజాగా తన భర్త పెద్ద అబధ్దాలకోరని, విలువలు లేని వ్యక్తి అని, తనని కాపాడుకోవడం కోసం అబద్దాలు ఆడుతూ తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక చివరి సారిగా షమీతో వాట్సాప్ కాల్ మాట్లాడానని అది కూడా షమీ ప్రణాళికలో భాగంగా చేసిందేనని ఆమె తెలిపారు. ఈ వీడియో కాల్‌లో వివాదం పరిష్కారం కావాలంటే ఏం చేయాలని అడిగాడని, చేసిన తప్పులు ఒప్పుకొని, క్షమాపణలు కోరాలని సూచించినట్లు ఆమె ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపారు.
క్రికెట్ గురించి అంతగా తెలియని తనకు షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు ఎలా చేస్తానని జహాన్ ప్రశ్నించారు. ఆ మొబైల్ ఫోన్ తనకి దొరక్కుండా ఉంటే షమీ ఎప్పుడో విడాకులిచ్చేవాడన్నారు. రెండేళ్లుగా తన భర్త నుంచి వేధింపులు భరిస్తున్నానని, సరైన ఆధారాలు లేకే ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చూశానన్నారు. ఇప్పటికీ అన్ని మరిచిపోయి నూతన జీవితం ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఇక ఐపీఎల్‌లో షమీ ఆడేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారడి ఉంది. వీలైనంత త్వరగా ఈ కేసు సమసి పోవాలని కోరుకుంటున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు రావటంతో బీసీసీఐ అవినీతి నిరోదక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే షమీ, తన భార్య జహాన్ కాల్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment