
హసీన్ జాహన్
ముంబై: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జాహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లైంగిక ఆరోపణలు, కేసులతో మహ్మద్ షమీ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చిన ఈ మాజీ మోడల్ ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో మంగళవారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్ జహాన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హసీన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ దర్యాప్తు చేసి క్లీన్ ఛీట్ ఇచ్చింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment