
మొన్న రహానే.. నిన్న ధోని.. ప్రస్తుతం షమీ.. ఇలా టీమిండియా క్రికెటర్ డాడీలు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే అజింక్య రహానే భార్య రాధిక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత భార్యా, బిడ్డలను మురిపెంగా చూస్తున్న ఫొటోను రహానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ధోని సైతం తన గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తాడన్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కూడా తన కూతురికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశాడు.
‘ మై డాల్. తన తండ్రి కంటే ఎంతో గొప్పగా డ్యాన్స్ చేసే నైపుణ్యం తనకు ఉంది’ అంటూ తన కూతురు ఓ స్టోర్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో షమీ అభిమానులు తనపై అభినందనలు కురిపిస్తున్నారు. ‘డాటరాఫ్ షమీ డ్యాన్స్ చాలా బాగుంది. సో క్యూట్’ అంటూ కాంప్లిమెంట్లు ఇస్తూనే.. ‘మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ సంబంధాలు కలిగి ఉండటంతో పాటు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో షమీ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తొలి టస్టులో ఐదు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీ.. రెండో టెస్టులోనూ మెరుగ్గా రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment