మహ్మద్ షమీ, హాసిన్ జాహన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్ జాహన్ తెలిపారు.
ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ‘2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నన్ను వేధిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్ మెదలెట్టారు. చంపాడానికి కూడా ప్రయత్నించారు. ఈ విషయంలో షమీ, అతని కుటుంబ సభ్యులపై ఇదివరకే పోలీసులకు సమాచారమిచ్చాను. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.’ అని హాసిన జాహన్ పేర్కొన్నారు.
తన కుటుంబం, పాప కోసం ఇన్నిరోజులు వేచి చూసానని, కానీ షమీలో మార్పు రాలేదని ఆమె ఆవెదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాల సహాయంతో షమీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక షమీ, జాహన్‌లకు 2014లో పెళ్లి కాగా వీరిద్దరికి ఒక పాప ఉంది.
కాగా ఈ ఆరోపణలపై మహ్మద్ షమీ ట్విటర్ వేదికగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశాడు. తనపై వచ్చిన అభియోగాలన్నీ అసత్యమని, ఆటపై దృష్టి సారించకుండా తన కెరీర్‌ను నాశనం చేయాలనే ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. అయితే షమీ ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే హాసిన జాహన్ పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్ డీయాక్టివేట్ కావడం చర్చనీయాంశమైంది.
Hi
— Mohammad Shami (@MdShami11) 7 March 2018
I'm Mohammad Shami.
Ye jitna bhi news hamara personal life ke bare may chal raha hai, ye sab sarasar jhut hai, ye koi bahut bada humare khilap sajish hai or ye mujhe Badnam karne or mera game kharab karne ka kosis ki ja rahi hai.
Comments
Please login to add a commentAdd a comment