నాకు మరో ఆప్షన్ లేదు: షమీ | I Have Only One Option, Says Mohammed Shami | Sakshi
Sakshi News home page

నాకు మరో ఆప్షన్ లేదు: షమీ

Published Sun, Mar 11 2018 6:12 PM | Last Updated on Sun, Mar 11 2018 6:15 PM

I Have Only One Option, Says Mohammed Shami - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భార్య హసీన్‌ జహాన్‌ చేస్తున్న సంచలన ఆరోపణలతో టీమిండియా పేసర్‌ మహ్మద్ షమీ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అతడి భవిష్యత్ ఏమౌతుందోనని క్రికెటర్ అభిమానులతో పాటు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఆలోచిస్తున్నాయి. కాగా, భార్య చేస్తున్న ఆరోపణలు, వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని షమీ భావిస్తున్నాడు. విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన షమీ ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి మీడియాతో పలు విషయాలు ప్రస్తావించాడు.

’రోజురోజుకు భార్య హసీన్ జహాన్ చేస్తున్న ఆరోపణలతో వివాదం ముదురుతోంది. చర్చించుకోవడం ద్వారానే ఈ సమస్య పరిష్కారమువుతుందని భావిస్తున్నా. ఇంతకుమించి నాకు మరో ఆప్షన్ ఉన్నట్లు కనిపించడం లేదు. కూతురు కోసం మేమిద్దరం కలిసి ఉండటమే సరైన నిర్ణయం. నా కుటుంబంతో హ్యాపీగా జీవించాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నేను కోల్‌కతాకు వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందంటే కచ్చితంగా వెళ్లి తీరుతా. భార్య ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ గొడవపై ఆమెను కలుసుకుని మాట్లాడి, పరిష్కార మార్గం వెతికేందుకు తాను సిద్దంగా ఉన్నానని’క్రికెటర్ షమీ వివరించారు.

మరోవైపు ఈ కేసుల కారణంగా ఐపీఎల్ లో షమీ ఆడకపోతే అతడి స్థానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎవరికీ చోటు కల్పిస్తుందన్న దానిపై చర్చ మొదలైంది. షమీ విషయంలో బీసీసీఐని కలిసి మద్ధతు కోరుతానని జహాన్ అంటున్నారు.

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement