
భార్య హసీన్ జహాన్‌తో మహ్మద్ షమీ(ఫైల్‌ఫొటో)
కోల్‌కతా:తన భార్య హసీన్ జహాన్‌పై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్పష్టం చేశాడు. భార‍్య హసీన్‌ను తన సోదరుడు అత్యాచారం చేశాడనే వార్తలపై స్పందించిన షమీ.. అందులో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నాడు.
‘హసీన్ చెబుతున్నట్టు డిసెంబర్ 7న నా సోదరుడు ఇక్కడ లేడు. ముర్దాబాద్‌లో ఉన్నాడు. డిసెంబర్ 6న భువనేశ్వర్ కుమార్ రిసెప్షన్‌కు నా భార్యతో కలిసి వెళ్లాను. అంతకుముందు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకూ టెస్టు మ్యాచ్ ఆడా. ఆ తర్వాత భువీ రిసెప్షన్‌కు భార్యతో కలిసి హాజరయ్యా. డిసెంబర్ 7న మధ్యాహ‍్నం గం.3.30ని.లకు మా హోమ్ టౌన్‌కు వెళ్లాం. మరి అటువంటప్పుడు ఆమెపై మా సోదరుడు అత్యాచారం చేశాడని ఆరోపించడం అర్థం లేనిది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని పూర్తి విచారణ చేయండి. ఈ కేసుతో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయి’ అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో షమీ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment