వెస్టిండీస్ టి20 కెప్టెన్ డారెన్ స్యామీ, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రస్సెల్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు..........
♦ వెస్టిండీస్ బోర్డు జాబితాలో
♦ లేని బ్రేవో, స్యామీ, రస్సెల్
సెయింట్ జాన్స్ (అంటిగ్వా): వెస్టిండీస్ టి20 కెప్టెన్ డారెన్ స్యామీ, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రస్సెల్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. ఈమేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) నిర్ణయం తీసుకుంది. 2015-16 సీజన్‌కు ప్రకటించిన జాబితాలో వీరితో పాటు స్పిన్నర్ సులేమాన్ బెన్, శివనారాయణ్ చందర్‌పాల్‌కు కూడా చోటు దక్కలేదు. అక్టోబర్ 1, 2015 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండే ఈ కాంట్రాక్ట్‌లో ఆటగాళ్లను 12 నుంచి 15 మందికి పెంచారు. క్రిస్‌గేల్, నరైన్ గతేడాది కూడా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో లేరు. కాంట్రాక్టుల్లో ఉంటే బోర్డు చెప్పినట్లు వినాలి. అన్ని లీగ్‌లలో ఆడటం కుదరదు.