
సిడ్నీ: క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కొత్తగా పేరంటల్ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. సీఏ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు ఇకపై ఈ సెలవుల్ని తీసుకోవచ్చని సీఏ తెలిపింది. ఇందులో భాగంగా మహిళా క్రికెటర్ తల్లయితే గరిష్టంగా 12 నెలలు సెలవులో ఉండొచ్చు. కాంట్రాక్టులో భాగంగా ఆమెకు రావాల్సిన ఆరి్థక ప్రయోజనాలి్న, వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేస్తారు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లకే ఇవ్వాలనుకున్నప్పటికీ పురుష క్రికెటర్లు తండ్రి అయినా కూడా సెలవులు ఇవ్వాలని సీఏ నిర్ణయించింది. అయితే వీరికి గరిష్టంగా మూడు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఈ జూలై 1 నుంచే ఇది అమల్లోకి వచి్చందని సీఏ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టు వ్యవధి మేరకు సెలవులు పూర్తయ్యాక గ్యారంటీగా కాంట్రాక్టు పొడిగింపు ఉంటుందని సీఏ భరోసా ఇచి్చంది. చిన్నారుల్ని దత్తత తీసుకున్నా సెలవులు తీసుకోవచ్చని సీఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment