parental leave
-
ఆ కంపెనీలో మహిళలతో సమానంగా పురుషులకు ప్రసూతి సెలవులు
ప్రముఖ గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సైయెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మహిళలతో సమానంగా పురుషులకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు కొత్త విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ కొత్త విధానం కింద సైయెంట్ ఉద్యోగులు లింగ భేదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెలవుల సమయంలో ఉద్యోగులు పూర్తి వేతనాన్ని అందుకొనున్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైయెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. "సైయెంట్ సంస్థను పని చేయడానికి గొప్ప ప్రదేశంగా మార్చడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. తల్లిదండ్రులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఈ విధానం సహాయపడుతుంది" అని సైయెంట్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పీఎన్ఎస్వీ నరసింహం తెలిపారు. "తల్లిదండ్రులైన వారికి కొన్ని దేశాల్లో ఇస్తున్న సెలవులు సరిపోవడం లేదని తమ దృష్టికి తీసుకొనిరావడంతో ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు కొత్త విధానం తోడ్పడుతుందని" సైయెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కృష్ణ బోడనాపు తెలిపారు. -
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్
స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మగ వాళ్లు కూడా ప్రసూతి సెలవులు తీసుకునేందుకు వీలు కల్పించింది. లింగ విషయంలో తటస్థ విధానాన్నిపాటిస్తూ 'ఫ్యామిలీ బాండ్'ను తీసుకొచ్చినట్లు వోల్వో ఇండియా ప్రకటించింది. వోల్వో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని పురుష ఉద్యోగులు మొత్తం జీతంలో 80 శాతంతో 24 వారాల(120 పని దినాలు) పేరెంటల్ లీవ్ తీసుకోవచ్చు. ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం, 2017 ప్రకారం మహిళా ఉద్యోగులు 26 వారాల పూర్తి చెల్లింపుతో ప్రసూతి సెలవులను ఇవ్వనున్నట్లు వోల్వో కార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వోల్వో కార్ ఇండియా గ్లోబల్ ఆదేశాలకు అనుగుణంగా భారతదేశంలోని తల్లులు, తండ్రులు, ఒకే సెక్స్ తల్లిదండ్రులు, పిల్లలను దత్తత తీసుకున్న, సర్రోగసీ ద్వారా కన్నా భారతదేశంలోని అందరి(ఆన్-రోల్, పూర్తి సమయం) ఉద్యోగులకు వర్తిస్తుంది అని ప్రకటనలో తెలిపింది. వయస్సు లేదా వైవాహిక స్థితిపై పరిమితులు లేవు. "వోల్వో, ఉద్యోగి-స్నేహపూర్వక సంస్థ కావడంతో తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉండాలని, ఇద్దరు భాగస్వాములు ఆనందాలను పంచుకోవాలని నమ్ముతాము" అని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. ఈ విధానంతో వోల్వో మరింత మంది ఉద్యోగులను తల్లిదండ్రుల సెలవు తీసుకోవటానికి ప్రోత్సహిస్తుందని జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. చదవండి: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి! -
ఆసీస్ క్రికెటర్లకు పేరంటల్ లీవ్స్
సిడ్నీ: క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కొత్తగా పేరంటల్ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. సీఏ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు ఇకపై ఈ సెలవుల్ని తీసుకోవచ్చని సీఏ తెలిపింది. ఇందులో భాగంగా మహిళా క్రికెటర్ తల్లయితే గరిష్టంగా 12 నెలలు సెలవులో ఉండొచ్చు. కాంట్రాక్టులో భాగంగా ఆమెకు రావాల్సిన ఆరి్థక ప్రయోజనాలి్న, వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేస్తారు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లకే ఇవ్వాలనుకున్నప్పటికీ పురుష క్రికెటర్లు తండ్రి అయినా కూడా సెలవులు ఇవ్వాలని సీఏ నిర్ణయించింది. అయితే వీరికి గరిష్టంగా మూడు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఈ జూలై 1 నుంచే ఇది అమల్లోకి వచి్చందని సీఏ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టు వ్యవధి మేరకు సెలవులు పూర్తయ్యాక గ్యారంటీగా కాంట్రాక్టు పొడిగింపు ఉంటుందని సీఏ భరోసా ఇచి్చంది. చిన్నారుల్ని దత్తత తీసుకున్నా సెలవులు తీసుకోవచ్చని సీఏ తెలిపింది. -
పురుష ఉద్యోగులకు బంపర్ ఆఫర్
స్వీడన్‌కు ఫర్నిచర్ కంపెనీ ఐకియా ఇండియా తన కంపెనీలో తల్లితండ్రులైన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లితోపాటు తండ్రికూడా ఆరు నెలల సెలవు దినాలను వర్తింప చేయనుంది. ఈ మేరకు కొత్త పేరెంటల్ లీవ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇక మీదట పురుష ఉద్యోగులకు కూడా ఆరు నెలల పెయిడ్ పెటర్నటీ లీవును అమలు చేయనుంది. తన సహ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ కొత్త విధానాన్ని ప్రకటించడం సంతోషగా ఉందని ఐకియా హెచ్ఆర్ మేనేజర్ అన్నా కారిన్ మాన్సన్ చెప్పారు. మహిళా ఉద్యోగులకు 26 వారాలకు వేతనంతోకూడిన సెలవుదినాలతోపాటు , మరో 16 వారాల పాటు పనిగంటల్లో 50శాతం కోత పెడుతున్నట్టు స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా. సంస్థలో ఉద్యోగులందరికీ ఈ కొత్త విధానాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు తల్లులైన మహిళా ఉద్యోగులకు అదనపు సౌకర్యాలను కల్పించనున్నామని చెప్పారు. ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలకు అదనంగా మరో రెండువారాల సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ గర్భధారణ, ప్రసవం కారణంగా అనుకోని అనారోగ్యం బారిన పడితే గరిష్టంగా ఒక నెలపాటు సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. సరోగేట్, సింగిల్ పేరెంట్, దత్తత తీసుకున్నా కూడా ఈ నిబంధన వర్తిస్తున్నందని కారిన్ మాన్సన్ తెలిపారు. 50/50 లింగ సమతుల్యతను సాధించే దిశగా తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. కుటుంబ బాధ్యతల్లో, పిల్ల పెంపకంలో ఉన్న ఉద్యోగుల కరియర్ కోసం డే కేర్ సెంటర్లు, దీర్ఘకాలిక శిక్షణ, డెవలప్మెంట్ ప్లాన్స్ లాంటి కొన్ని ప్రత్యేక చర్యల్ని కూడా చేపడుతున్నట్టు చెప్పారు. కాగా జర్మనీకి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం డ్యుయిష్ బ్యాంక్ ఇండియా కూడా తండ్రులు 6 నెలల సెలవును ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.