టీ20 వరల్డ్‌కప్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. అఫ్గానిస్తాన్‌పై గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా అదే జోరును బంగ్లాపై కొనసాగించాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి సూపర్-8 మ్యాచ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే వైపు జట్టు మెనెజ్‌మెంట్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది.
అంటిగ్వా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన జడ్డూ స్ధానంలో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు బంగ్లాతో మ్యాచ్‌లో ఆడించాలని మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఒకవేళ జట్టులోకి జైశ్వాల్ వస్తే రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. అప్పుడు విరాట్ కోహ్లి ఫస్ట్‌డౌన్‌లో రానునున్నాడు. ఒకవేళ దూబే స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్‌కు అవకాశమివ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తే సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మనదే పై చేయి...
కాగా టీ20ల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. భారత్ - బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలవగా.. 12 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment