IPL 2024: 'సెంచరీ' కొట్టిన రవీంద్ర జడేజా.. | Ravindra Jadeja Joins Virat Kohli In Exclusive List | Sakshi
Sakshi News home page

IPL 2024: 'సెంచరీ' కొట్టిన రవీంద్ర జడేజా..

Published Mon, Apr 8 2024 11:19 PM | Last Updated on Mon, Apr 8 2024 11:20 PM

Ravindra Jadeja Joins Virat Kohli In Exclusive List - Sakshi

PC: IPL.com

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల క్లబ్‌లో జడ్డూ చేరాడు చేరాడు. ఈ మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్‌గా జడేజా నిలిచాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన జడ్డూ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(110) టాప్‌లో ఉండగా.. సురేశ్ రైనా(109), రోహిత్ శర్మ(100), రవీంద్ర జడేజా(100), శిఖర్ ధావన్(98) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కెకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది.

సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్‌ రెహ్మన్‌ రెండు, థీక్షణ ఒక్క వికెట్‌సాధించారు. కేకేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

చెన్నై బ్యాటర్లలో  కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్‌ దూబే(28) మరోసారి అదరగొట్టాడు.కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్‌ ఒక్క వికెట్‌ సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement