
PC: IPL.com
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో ధోని ఒక్క పరుగుతో ఆజేయంగా నిలిచాడు.
తద్వారా ఈ అరుదైన రికార్డను మిస్టర్ కూల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ధోని ఛేజింగ్‌లో అత్యధికంగా 28 సార్లు అజేయంగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరిట ఉండేది.
జడ్డూ 27 సార్లు అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును ధోని బ్రేక్ చేశాడు. ధోని, జడేజా తర్వాత స్ధానాల్లో దినేష్ కార్తీక్(23), యూసుఫ్ పఠాన్ (22), డేవిడ్ మిల్లర్(22) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
చదవండి: IPL 2024 CSK VS KKR: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ
Comments
Please login to add a commentAdd a comment