చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటకి ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమ కనబరిచారు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో సమయంలో వీరిద్దరూ తమ వీరోచిత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. అప్పటివరకు నిప్పులు చేరిగిన బంగ్లా పేసర్లపై ఈ స్టార్ ఆల్‌రౌండర్లు ఎదురుదాడికి దిగారు.
ఈ క్రమంలో వీరిద్దరూ ఏడో వికెట్‌కు 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (102 నాటౌట్; 112 బంతుల్లో 10×4, 2×6), రవీంద్ర జడేజా (86 నాటౌట్; 117 బంతుల్లో 10×4,2×6) ఉన్నారు. ఈ సీనియర్ క్రికెటర్లతో పాటు యశస్వీ జైశ్వాల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు.
నిప్పులు చేరిగిన హసన్ మహమూద్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి సెషన్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ చుక్కలు చూపించాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ, కోహ్లి, గిల్ వికెట్లను పడగొట్టి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 18 ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్.. 58 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment