భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని తరహాలో ఓ రనౌట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ బంతిని నాన్ స్టయికర్ వైపు విసిరాడు. వికెట్ల వద్ద బాల్‌ను కలెక్ట్ చేసుకున్న జడేజా చూడకుండా బంతిని వికెట్లపైకి విసిరాడు.
ఈ లోపు నాన్ స్ట్రయికర్ వైపు పరుగు తీస్తున్న విలియమ్ ఓరూర్కీ క్రీజ్‌ను చేరుకోలేకపోయాడు. జడేజా డౌట్ ఫుల్‌గా అప్పీల్ చేయగా.. రీప్లేలో అది ఔట్‌గా తేలింది. గతంలో ధోని చాలా సార్లు ఇలా ఫీల్డర్లు విసిరిన బంతిని చూడకుండానే వికెట్లపైకి నెట్టి రనౌట్స్ చేశాడు. జడ్డూ రనౌట్ చేసిన విధానాన్ని చూసిన నెటిజన్లు ధోని శిష్యుడివి అనిపించుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
The Thala effect in Ravindra Jadeja's run out. 😄pic.twitter.com/tBoXdr27O6
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024
కాగా, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ టీమిండియా ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment