భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రెండు భారీ రికార్డులపై కన్నేశారు.
ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 58 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించనుండగా, జడేజా మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్‌ల్లో భారత్ తరఫున 300 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
ప్రస్తుతం విరాట్ ఖాతాలో 26942 పరుగులు (మూడు ఫార్మాట్లలో కలిపి).. జడ్డూ ఖాతాలో 294 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. బంగ్లాతో మ్యాచ్‌లో కోహ్లి 152 పరుగులు సాధిస్తే.. టెస్ట్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
జడ్డూ ఖాతాలో మరిన్ని రికార్డులు..
బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో జడేజా మరో 6 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 300 వికెట్ల మైలురాయి తాకిన నాలుగో భారత స్పిన్నర్‌గా.. ఓవరాల్‌గా (పేసర్లతో కలుపుకుని) ఏడో భారత బౌలర్‌గా.. టెస్ట్‌ల్లో 300 వికెట్లతో పాటు 3000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆల్‌రౌండర్‌గా.. ఓవరాల్‌గా 11వ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్(516), హర్భజన్ సింగ్ (417).. పేసర్లలో కపిల్ దేవ్(434), జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311) జడ్డూ కంటే ముందు 300 వికెట్ల మైలురాయిని తాకారు. టెస్ట్‌ల్లో జడేజా కంటే ముందు కపిల్ దేవ్, అశ్విన్ 3000 పరుగులు, 300 వికెట్ల మార్కును తాకారు.
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
Comments
Please login to add a commentAdd a comment