టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టే సత్తా సూర్యకు ఉంది అని రవిశాస్త్రి కొనియాడాడు.
"సూర్యకు మూడు ఫార్మాట్లలో రాణించే సత్తా ఉంది. సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం కోసం ఎవరూ మాట్లాడరు. కానీ సూర్య టెస్టు క్రికెట్ కూడా అద్భుతంగా ఆడగలడని నేను భావిస్తున్నాను. అతడిని టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపండి. అందరనీ అతడు ఆశ్చర్యానికి గురి చేస్తాడు" రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’!
Comments
Please login to add a commentAdd a comment