Ravi Shastri comments
-
'సూర్యకు టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. దుమ్ము రేపుతాడు'
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టే సత్తా సూర్యకు ఉంది అని రవిశాస్త్రి కొనియాడాడు. "సూర్యకు మూడు ఫార్మాట్లలో రాణించే సత్తా ఉంది. సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం కోసం ఎవరూ మాట్లాడరు. కానీ సూర్య టెస్టు క్రికెట్ కూడా అద్భుతంగా ఆడగలడని నేను భావిస్తున్నాను. అతడిని టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపండి. అందరనీ అతడు ఆశ్చర్యానికి గురి చేస్తాడు" రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’! -
రవిశాస్త్రి వ్యాఖ్యలు కలచివేశాయి.. బస్సు కిందకు తోసేసినట్లు అనిపించింది..!
Ravichandran Ashwin: భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఆసీస్ పర్యటన సందర్భంగా రవిశాస్త్రి.. సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. పరోక్షంగా తనను కించపరిచే వ్యాఖ్యలు చేశాడని అన్నాడు. రవిశాస్త్రి చేసిన ఆ వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, కదిలే బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని వాపోయాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. అశ్విన్ తన మనసులోని బాధను వెల్లగక్కాడు. వివరాల్లోకి వెళితే.. 2018 ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్(నాలుగో టెస్ట్)లో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో కుల్దీప్ భారత నంబర్‌వన్ స్పిన్నర్ అని కొనియాడాడు. రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలే తనను తీవ్రంగా బాధించాయని, బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని అశ్విన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, తాను బాధపడింది కుల్దీప్ను పొగిడినందుకు కాదని, ఆసీస్ గడ్డపై తనకు ఐదు వికెట్లు దక్కనందుకేనని చెప్పుకొచ్చాడు. కుల్దీప్ ప్రదర్శన పట్ల మనస్పూర్తిగా సంతోషించానని.. అయితే టీమిండియా గెలుపులో తన పాత్ర లేకపోవడం బాధించిందని, అందుకు తాను జట్టు గెలుపు సంబరాల్లో కూడా పాల్గొనకూడదని అనుకున్నట్లు వివరించాడు. ఆ సందర్భంలో తాను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన కూడా చేసినట్లు అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది.. -
‘రోహిత్ గాయం పెరిగే ప్రమాదం ఉంది’
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయం తీవ్రతకు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంపై వివాదం కూడా నెలకొంది. అయితే జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై మొదటిసారి పెదవి విప్పాడు. అతను గాయం మరింత పెద్దది కాకూడదనే కారణంతోనే జాగ్రత్త పడుతున్నామని వెల్లడించాడు. తొందర ప్రదర్శించి బరిలోకి దిగితే రోహిత్‌కు మరింత సమస్య ఎదురు కావచ్చని రవిశాస్త్రి అన్నాడు. ‘బీసీసీఐ వైద్య బృందం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ టీమ్ తమ నివేదికను సెలక్టర్లకు అందజేసింది. అందులో మా పాత్ర ఏమీ లేదు. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత గాయానికి విశ్రాంతి అవసరమని, తొందరపడి ఆడే ప్రయత్నం చేస్తే అతను మళ్లీ తనను తాను గాయపర్చుకునే ప్రమాదం ఉందని ఆ నివేదికలో ఉంది. నేను సెలక్షన్ కమిటీలో సభ్యుడిని కాను. అతడిని పక్కన పెట్టడంలో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. -
రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ పదవి దక్కనందుకు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ తనను ఇంటర్వ్యూ చేసినపుడు కమిటీ సభ్యుడు సౌరభ్ గంగూలీ పాల్గొనలేదని రవిశాస్త్రి చెప్పాడు. థాయ్‌లాండ్ నుంచి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తనను మంచి ప్రశ్నలు అడిగారని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా స్పందిస్తూ.. ఇంటర్వ్యూ పూర్తిగా రహస్య విషయమని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై తాను మాట్లాడదలచుకోలేదని చెబుతూనే.. మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆయన్ను ఇంటర్వ్యూ చేశారని తెలిపాడు. ఆ సమయంలో తాను క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత సచిన్, లక్ష్మణ్‌ను కలిశానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించిన సంగతి తెలిసిందే.