టీమిండియా యవ ఆటగాడు శుబ్‌మాన్ గిల్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్రి ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను బాగా మెరుగుపరుచుకున్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా గిల్‌కు మూడు ఫార్మాట్‌లలో ఆడే సత్తా ఉంది రవిశాస్రి అభిప్రాయడ్డాడు. కాగా గిల్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఉన్నాడు.
తొలి వన్డేలో అర్దసెంచరీతో ఆకట్టుకున్న గిల్.. వర్షం కారణంగా రద్దైన రెండో వన్డేలో కూడా 45 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది 11 వన్డేలు ఆడిన గిల్.. 625 పరుగులు పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ క్రమంలో వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో గిల్ అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైమ్ వీడియోతో రవిశాస్రి మాట్లాడుతూ.. "గిల్ ప్రస్తుతం బాల్‌ను సరిగ్గా టైమింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆటగాళ్లు తమ ఫామ్‌ను కోల్పోయినప్పడు బంతిని గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ గిల్ మాత్రం కంట్రోల్‌గా షాట్‌లు ఆడుతున్నాడు.
గిల్ తన బ్యాటింగ్ స్కిల్స్ చాలా మెరుగుపరుచుకున్నాడు. గిల్‌కు అద్భుతమైన ఫుట్‌వర్క్ ఉంది. గిల్ మరో పదేళ్ల పాటు భారత జట్టుకు ఆడుతాడు. ఎందుకంటే అతడికి కష్టపడే సత్తా ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో శుబ్‌మాన్ స్ట్రైక్ రేట్ మెరుగైంది. అతడు సగటు కూడా 70కిపైగా ఉంది. కాబట్టి గిల్ వంటి అద్భుతమైన ఆటగాడికి టీ20ల్లో కూడా అవకాశం ఇవ్వాలి. గిల్‌కు మూడు ఫార్మాటాల్లో రాణించే సత్తా ఉంది." అని అతడు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment