Ravi Shastri Comments On ODI Captaincy Saga: గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాల గురించి టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ- కెప్టెన్ విరాట్ కోహ్లిలలో ఎవరు నిజం చెబుతున్నారన్న విషయం అప్రస్తుతమని.. కాస్త పరిణతితో ఆలోచించి దీనిని పరిష్కరించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియామకం నేపథ్యంలో.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని గతంలో తాను కోహ్లికి నచ్చజెప్పినా వినలేదని గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇందుకు స్పందించిన కోహ్లి తనతో దాదా ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని స్పష్టం చేశాడు. బీసీసీఐ ,అధ్యక్షుడి నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే, గంగూలీ మాత్రం ఇంతవరకు కోహ్లి కామెంట్లపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘‘విరాట్ తను చెప్పాల్సింది తాను చెప్పాడు. ఇప్పుడు బోర్డు అధ్యక్షుడు తన వాదన వినిపించాలి. ఎవరు అబద్ధం ఆడుతున్నారు.. ఎవరు నిజం చెబుతున్నారు అనేది ఇక్కడ సమస్య కాదు.
నిజానికి వారి మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా తెలిసేంతవరకు మనదైన భాష్యాలు చెప్పకూడదు. ఇద్దరి మధ్య సమన్వయలోపం లేకుంటే... సమస్య ఇంతదూరం వచ్చేది కాదు’’ అని పేర్కొన్నాడు. ఇక వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియామకాన్ని సమర్థించిన రవిశాస్త్రి.. టెస్టుల్లో కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ కెప్టెన్‌గా ఉన్నాడని కొనియాడాడు. ‘‘కోహ్లిలా అంకితభావంతో జట్టును ముందుండి నడిపించే కెప్టెన్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కోహ్లితో కలిసి చాలాకాలం ప్రయాణం చేశాను. తనతో అనుబంధం అత్యద్భుతం. తనలో ఆత్మవిశ్వాసం మెండు. జట్టును గెలిపించాలనే కసితో ఆడతాడు’’ అని కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
చదవండి: SA Vs IND: భారత ఆటగాళ్లకు ద్రవిడ్ స్పెషల్ క్లాస్.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment