
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి మానసికంగా అలసిపోయాడని.. అతనికి రెండు నెలల విశ్రాంతి ఇస్తే అంతా సర్దుకుంటుందని పేర్కొన్నాడు. మంగళవారం స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.
''కోహ్లి మానసికంగా బాగా అలసిపోయాడు. అది అతని ఆటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కనీసం అతనికి రెండు నెలలైనా విశ్రాంతినిస్తే బాగుంటుంది. 2019 నవంబర్ తర్వాత కోహ్లి మళ్లీ సెంచరీ చేయలేదు. అతని సెంచరీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తోనైనా ఆ కొరత తీరుస్తాడనుకుంటే నిరాశే మిగులుతుంది. దీంతో సెంచరీ అందుకోవాలనే తాపత్రయంలో ఒత్తిడిలో నలిగిపోతున్నాడు. ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపట్ల సానభూతితో ఉండాలి.. అనవసర ంగా ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు.
దీనికి ఒకటే మార్గం ఉంది. అదే విశ్రాంతి. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందన్న లేక తర్వాతైనా కోహ్లికి విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. కోహ్లిలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడితో ఆడించి ఆటకు దూరం చేయకూడదు. ఇది ఒక్క కోహ్లి పరిస్థితి మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి సమస్య ఎదుర్కొన్న క్రికెటర్లు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. అసలు సమస్య ఏంటో గుర్తిస్తే మంచిది'' అంటూ పేర్కొన్నాడు.
ఇక ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకున్న కోహ్లి బ్యాట్స్‌మన్‌గా ఇరగదీస్తాడనుకుంటే నిరాశే మిగులుతుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోహ్లి ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లిని దురదృష్టం కూడా వెంటాడుతుంది. అనవసర రనౌట్లు, అంపైర్ నిర్ణయాలకు బలవ్వడం జరిగాయి. ఇక లక్నోతో మ్యాచ్‌లో కోహ్లి ఏకంగా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
చదవండి: Surya Kumar Yadav: 'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా'
కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్‌ప్రెషన్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ