IPL 2022: Ravi Shastri Comments On VIrat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్-2022 సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. తాజా ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బ్యాటర్‌గా బరిలోకి దిగిన కోహ్లి ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో అతడు సాధించినవి 128 పరుగులు(అత్యధిక స్కోరు 48).
ఇక ఆయుష్ బదోని వంటి అరంగేట్ర ఆటగాళ్ల స్కోరు(7 ఇన్నింగ్స్‌లో 134 పరుగులు- అత్యధికం 54) కంటే కూడా కోహ్లి స్కోరు తక్కువ కావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో సతమవుతున్న ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం(ఏప్రిల్ 27) మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగినా ఆటతీరు మాత్రం మారలేదు. ఈ మ్యాచ్‌లో.. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 9 పరుగులు(2 ఫోర్లు) మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులో నుంచి తీసేయాలంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కోహ్లికి సన్నిహితుడిగా పేరొందిన రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. కోహ్లికి మాత్రమే తన సలహా పరిమితం కాదని, అతడిలా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న వాళ్లు బ్రేక్ తీసుకుంటే మంచిదని సూచించాడు.
ఈ మేరకు రవిశాస్త్రి ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ..‘‘గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి నిర్విరామంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. తనకు బ్రేక్ అత్యవసరం. ఈ ఏడాది తను ఎలాగో ఐపీఎల్ ఆడుతున్నాడు. పర్లేదు.
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరేడేళ్ల పాటు తన మార్కు చూపించాలనుకుంటే ఐపీఎల్ నుంచి వైదొలగడమే మంచిది. తనొక్కడే కాదు తనలా ఇబ్బంది పడుతున్న ఇతర ఆటగాళ్లు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేలు’’ అని అభిప్రాయపడ్డాడు.
చదవండి👉🏾 IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్
That's that from Match 39.@rajasthanroyals take this home by 29 runs.
— IndianPremierLeague (@IPL) April 26, 2022
Scorecard - https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/9eGWXFjDCR
Comments
Please login to add a commentAdd a comment