టీ20 వరల్డ్‌కప్-2022: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
ICC Mens T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022లో భారత్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం పంచిందనడంలో సందేహం లేదు. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్‌ల మధ్య పోరు కంటే కూడా ఈ మ్యాచ్ ఎక్కువ మజాను అందించనడం అతిశయోక్తి కాదు. అసలే సెమీస్ రేసులో నిలిచేందుకు పోటీ.. టీమిండియా మెరుగైన స్కోరు.. ధీటుగా బదులిస్తూ జోష్ మీదున్న బంగ్లాదేశ్‌కు వరణుడి ఆటంకం..
డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో ఓవర్ల కుదింపు.. వెరసి ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. టీ20 మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకుడికి ఇంతకంటే వినోదం ఎక్కడా దొరకదు. ఇదే తరహాలో.. అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్ ఒకటి గతంలో జరిగింది.. అది కూడా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో.. మ్యాచ్ కూడా భారత్- బంగ్లాదేశ్ మధ్యే!
అప్పుడు కూడా ఇలాగే
టీ20 ప్రపంచకప్-2016లో భాగంగా సూపర్-10లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 35 పరుగులతో శుభారంభం అందించగా.. సబ్బీర్ రెహమాన్ 26, షకీబ్ అల్ హసన్ 22, సౌమ్య సర్కార్ 21 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో బంగ్లా విజయ సమీకరణం 11 పరుగులుగా మారింది.
దీంతో ఇరు జట్లు.. మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకుల్లోనూ టెన్షన్.. టెన్షన్.. సరిగ్గా అప్పుడే మిస్టర్ కూల్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. తన వ్యూహాన్ని అమలు చేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.
నరాలు తెగే ఉత్కంఠ
మొదటి మూడు బంతుల్లో బంగ్లాకు 9 పరుగులు వచ్చాయి. అయితే, ఆ తర్వాత పాండ్యా మ్యాజిక్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు కూల్చాడు. బంగ్లా గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. స్టంప్స్ వెనుక ధోని చురుగ్గా కదులుతుండగా అది సాధ్యమయ్యే పనేనా? చివరి బాల్‌కు ముస్తాఫిజునర్ రహ్మాన్‌ను ధోని రనౌట్ చేయడంతో బంగ్లా కథ ముగిసింది. ఒక్క పరుగు తేడాతో విజయం టీమిండియా సొంతమైంది.
ఒత్తిడి భరించలేక టాయిలెట్‌లోకి
సూపర్-12లో భాగంగా భారత్- బంగ్లా మధ్య బుధవారం నాటి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి 2016 నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ధోని హార్దిక్ చేతికి బంతినివ్వడం చూశాను.
ఆఖరి ఓవర్లో నేను టెన్షన్ భరించలేకపోయాను. ఆటగాళ్లందరితో బాల్కనీలో సమావేశమయ్యాను. కానీ ఒత్తిడిని భరించలేకపోయాను. అక్కడి నుంచి టాయ్‌లెట్‌కు వెళ్లాను’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..! అంటూ
Comments
Please login to add a commentAdd a comment