టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాను పాండ్యా పూర్తి చేశాడు. అయితే 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. 37 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతమైన షాట్లు ఆడుతూ అలరించాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఆడిన పాండ్యా 33 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో పాండ్యాకు కచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
"హార్ధిక్ పాండ్యా ఫుల్ ఫిట్‌గా కన్పిస్తున్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధించడానికి చాలా కష్టపడ్డాడు. హార్ధిక్ ఫిట్‌నెస్ సాధించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. హార్ధిక్ లాంటి ఆటగాడు ఫుల్ ఫిట్‌నెస్‌గా ఉన్నప్పుడు మరింత చేలరేగి ఆడుతాడు. అదే విధంగా హార్ధిక్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. అతడు మ్యాచ్ విన్నర్, అద్భుతమైన ఫీల్డర్. అతడు ఇదే ఫిట్‌నెస్ కొనసాగిస్తే.. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కచ్చితంగా ఉంటాడు"అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment