ముంబై ఇండియన్స్ (PC: IPL/BCCI)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. అభిమానులు మైదానంలో అతడి పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఇప్పటికే హర్భజన్ సింగ్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఇక భజ్జీ అయితే.. ఫ్యాన్స్‌తో పాటు ముంబై ఆటగాళ్ల తీరును కూడా విమర్శించాడు. జట్టు అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను అంగీకరించాల్సిందేనని సూచించాడు. ఇదిలా ఉంటే.. సంజయ్ మంజ్రేకర్ సైతం వాంఖడే స్టేడియంలో పాండ్యాను హేళను చేస్తున్న వారిని ఉద్దేశించి.. ‘మర్యాద పాటించండి’ అని హెచ్చరించాడు.
తాజాగా రవిశాస్త్రి సైతం హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. ముంబై జట్టు అభిమానులను ఉద్దేశించి.. ‘‘ ఈ జట్టుకు ఎన్నో ఏళ్లుగా మీరు మద్దతుగా నిలుస్తున్నారు. కేవలం 2-3 మ్యాచ్‌ల ఫలితాల వల్ల ఇదేమీ చెత్త జట్టు కాబోదు కదా!
ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి టీమ్ ఇది. కాకపోతే ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కాస్త ఓపిక పట్టండి. పాపం.. తను కూడా మీలాంటి మనిషే కదా. రోజు ముగిసిన తర్వాత రాత్రి తను కూడా నిద్రపోవాలి కదా.
తన స్థానంలో ఉండి ఆలోచించండి. కాస్త నిశ్శబ్దంగా ఉండండి’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు కూడా కాస్త ఓపిక పట్టు హార్దిక్. కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టు.
ముంబై ఇండియన్స్ అద్భుతమైన జట్టు. 3-4 మ్యాచ్‌లు గెలిచిందంటే ఆ తర్వాత ఎవరూ ఆపలేరు. కథ మొత్తం మారిపోతుంది’’ అని రవిశాస్త్రి సలహాలు ఇచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్ తదుపరి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ముంబై వేదికగా ఏప్రిల్ 7న ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడూ ఓడిపోయిన విషయం తెలిసిందే.
చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట?
Comments
Please login to add a commentAdd a comment