ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అగ్రస్ధానానికి అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మంధాన రెండో స్ధానానికి చేరుకుంది. ఓ స్ధానం మెరుగుపరుచుకుని రెండో స్ధానానికి మంధాన దూసుకొచ్చింది.
ఐర్లాండ్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కారణరంగా స్మృతి ర్యాంక్ మెరుగుపడింది. ఈ భారత వైస్ కెప్టెన్ ఖాతాలో ప్రస్తుతం 738 పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్‌లో మంధాన అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి ఓ సెంచరీతో పాటు మొత్తంగా 249 పరుగులు చేసింది. కాగా ఐసీసీ మహిళల బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో భారత్ నుంచి మంధాన ఒక్కరే ఉండడం గమనార్హం.
మరోవైపు ఈ ఐరీష్ సిరీస్‌లో సెంచరీతో కదం తొక్కిన జెమిమా రోడ్రిగ్స్ రెండు స్ధానాలు మెరుగు పరుచుకుని 17వ ర్యాంక్‌కు చేరుకుంది. అదేవిధంగా ఈ సిరీస్‌కు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇక ఆల్‌రౌండర్ కోటాలో స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ 344 పాయింట్లతో ఆరో స్ధానంలో నిలిచింది.
టాప్‌లో సౌతాఫ్రికా బ్యాటర్..
కాగా వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(773) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో మంధాన(738), మూడో స్ధానంలో శ్రీలంక బ్యాటర్ చమిర అతపట్టు(733) మూడో స్ధానంలో ఉన్నారు. మహిళల వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫియా ఎకిల్‌స్టోన్(770) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. గార్డెనర్(724), మెగాన్ స్కాట్(696) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు.
చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment