ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటివరకు ఇంకా అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు.
అందుకు కారణం బీసీసీఐ-పీసీబీ మధ్య నెలకొన్న విభేదాలే. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు పంపేంచేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది.
అందుకు అన్ని క్రికెట్ బోర్డులు అంగీకరించినా, పీసీబీ మాత్రం ససేమీరా అంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహణకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ అందుకు ఒప్పుకోపోతే టోర్నీని పాక్ నుంచి వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీబీ ఓ మెట్టు దిగి వచ్చి హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేందుకు సిద్దమైనట్లు సమాచారం.
మరో కొత్త ట్విస్ట్..
తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో మరో కొత్త ఆంశం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌కు బదులగా టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం..ఐసీసీ షెడ్యూల్‌ను ఇంకా ఖారారు చేయకపోవడంతో మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని పెట్టబడుదారులు అవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి కొన్ని రోజులు ఇదే తంతు కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లలో నిర్వహించాలని సదరు స్టేక్‌హోల్డర్స్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు ఐసీసీ కూడా సముఖంగా ఉన్నట్లు క్రిక్‌బజ్‌తో పాటు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వన్డే ఫార్మాట్ కంటే టీ20లను ఈజీగా నిర్వహించవచ్చని ఐసీసీ భావిస్తున్నట్లు వినికిడి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై గురువారం(డిసెంబర్ 12)ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
చదవండి: IND vs AUS: 'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్'
Comments
Please login to add a commentAdd a comment