ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? | Champions Trophy 2025: Tentative Match Schedule Released | Sakshi
Sakshi News home page

CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Published Sat, Dec 21 2024 7:19 PM | Last Updated on Sat, Dec 21 2024 7:31 PM

Champions Trophy 2025: Tentative Match Schedule Released

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖారారు చేసిటన‌ట్లు తెలుస్తోంది. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో 'రెవ్‌స్పోర్ట్జ్‌' అనే స్పోర్ట్స్‌ వెబ్ సైట్‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

రెవ్‌స్పోర్ట్జ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో క‌రాచీ వేదిక‌గా పాకిస్తాన్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు ఈ మెగా ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. అయితే టీమిండియా త‌మ మొద‌టి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో త‌లప‌డ‌నుంది. భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌న్నీ త‌ట‌స్ధ వేదిక‌పై జ‌రుగుతాయి అని స‌ద‌రు వెబ్‌సైట్ పేర్కొంది.

దాయాదుల పోరు ఎప్పుడంటే?
రెవ్‌స్పోర్ట్జ్ ప్ర‌కారం.. ఈ మెగా టోర్నీలో ఫిబ్ర‌వ‌రి 23న చిర‌కాల ప్ర‌త్య‌ర్ధిలు పాకిస్తాన్‌-భార‌త్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లను ఆడనుంది. న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న ఆడనుంది.

మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా త‌మ మ్యాచ్‌ల‌ను శ్రీలంక లేదా దుబాయ్ వేదిక‌లగా ఆడే అవకాశ‌ముంది.

కాగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనుంది. భారత మ్యాచ్‌లు మినహా మిగితా అన్నీ పాక్‌లోనే జరగనున్నాయి. టీమిండియా ఒకవేళ నాకౌట్స్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా తటస్థవేదిక గానే జరగనున్నాయి.
చదవండి: VHT 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement