ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా తెలియజేసింది.
భారత్ ఆడే మ్యాచ్‌లని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు సుముఖంగా లేదు. కచ్చితంగా భారత జట్టు తమ దేశానికి రావల్సేందేనని పీసీబీ మొండి పట్టుతో ఉంది. అయితే టీమిండియా పాక్‌కు రాదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా పీసీబీకి తేల్చి చేప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
భారత్ ఆడే మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ ఈ ఆఫర్‌ను అంగీకరించేందుకు పీసీబీ సిద్దంగా లేదని, అందుకు నిరసనగా ఆతిథ్య హక్కులు వదులు కోవాలని భావిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అదొక పగటి కల..
ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు రావాలనుకోవడం ఒక పగటి కల. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్దం ఉంది.
భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదు. వరల్డ్‌లోని అన్ని క్రికెట్ దేశాలకు పాకిస్తాన్ స్వదేశంలో ఆతిథ్యం ఇస్తోంది. కానీ ఒక్క భారత్‌కే మాత్రం ఇక్కడ ఆడటం భద్రత కాదు. ఇందుకు బదులుగా మా ప్రభుత్వం, పీసీబీ నుంచి స్ట్రాంగ్ రిప్లై వస్తుంది అని ఆశిస్తున్నా" హాఫీజ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
It was a day dream that India wil come to Pakistan to play #ChampionsTrophy2025. Pakistan is safe & ready to host the event. Pakistan hosting all cricket nations at home but somehow not *secure* for India 😇😇😇. Waiting for strong & surprised response from government & PCB.
— Mohammad Hafeez (@MHafeez22) November 11, 2024
చదవండి: IND vs AUS: 'బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.. అతడితో అంత ఈజీ కాదు'
Comments
Please login to add a commentAdd a comment