ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖారారు. పాక్‌కు టీమిండియా వెళ్తుందా? | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖారారు. పాక్‌కు టీమిండియా వెళ్తుందా?

Published Mon, Apr 29 2024 9:15 PM

PCB finalises Lahore, Karachi, Rawalpindi as venues for Champions Trophy

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025కు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఛాంపియన్స్‌ ట్రోఫీకి పీసీబీ వేదికలను ఖారారు చేసింది. 

కరాచీ, లాహోర్,రావల్పిండిలలో మ్యాచ్‌లను నిర్వహించినున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే భారత జట్టు విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఆసియాకప్‌-2023లో పాల్గోనందుకు పాకిస్తాన్‌కు తమ జట్టును పంపించేందుకు నిరాకరించిన బీసీసీఐ.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. 

దాదాపుగా టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించే అవకాశము లేనుందన.. ఈ మెగా టోర్నీ ఆసియా కప్‌ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్ లోనే జరిగే ఛాన్స్‌ ఉంది.

"ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశాం. షెడ్యూల్‌ను ఐసీసీకి పంపించాం. ఐసీసీ భద్రతా బృందంతో మేము సమావేశమయ్యాం. ఈ మీటింగ్‌ బాగా జ‌రిగింది. పాక్‌లో టోర్నీ ఏర్పాట్ల‌ను వాళ్లు ప‌రిశీలించారు. వారితో స్టేడియం అప్‌గ్రేడ్ ప్లాన్‌లను కూడా పంచుకున్నాం. ఈ టోర్నీని మేము విజయవంతంగా నిర్వహిస్తామని నమ్మకం మాకు ఉందని" పీసీబీ చీఫ్ మొహ్సిన్ న‌ఖ్వీ పేర్కొన్నారు.

కాగా ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. చివ‌రిసారిగా 2017లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement