![Quaid e Azam Trophy Finalists kicked out of hotel by management - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/23/pakistan.jpg.webp?itok=18MehG0e)
పాకిస్తానీ క్రికెటర్‌లకు ఘోర అవమానం జరిగింది. క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీ ఫైనల్లో బాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్న ఆటగాళ్లను ఉన్నపళంగా హోటల్ నుంచి సిబ్బంది ఖాళీ చేయించారు. దీంతో ఆటగాళ్లు లగేజితో రోడ్డున పడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫి ఫైనలిస్ట్‌లు ఫన్ఖుత్వా, నార్తరన్ జట్లు క్లబ్ రోడ్డులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్నాయి. ఈ ఆటగాళ్ల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిసెంబర్22 వరకు మాత్రమే హోటల్‌ను బుక్ చేసింది. తదపరి బుకింగ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్వాన్స్ చెల్లించలేదు.
అయితే, ముందు చెప్పిటన్లు కాకుండా... జట్టుసభ్యులు సంఖ్య ఎక్కువగా ఉండండంతో మునపటి బుకింగ్‌ను రద్దు చేసిన తరువాతే కొత్త బుకింగ్ చేస్తామని ఆ హోటల్‌కు బోర్డు తెలిపినట్లు సమాచారం. ఆ తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, హోటల్ మేనేజ్‌మెంట్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరుగలేదు. కానీ.. పీసీబీ మాత్రం తమ బుకింగ్‌లను హోటల్ ధృవీకరించబడినట్లు భావించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సమాచార, సమన్వయ లోపం కారణంగా ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లగేజీతో రోడ్డు మీద వేచిచూడాల్సిన దుస్థితి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment