
ఐసీసీ క్రికెట్ జనరల్ మేనేజర్‌గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం ఖాన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం వెల్లడించింది. ఇక ఎనిమిదేళ్లపాటు జనరల్ మేనేజర్‌గా పనిచేసిన జియోఫ్ అల్లార్డిస్ ఇటీవల ఐసీసీ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందాడు. అతడి స్ధానంలోనే వసీం ఖాన్ బాధ్యతలు చేపట్టాడు.
వసీం ఖాన్ గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. ఇక జనరల్ మేనేజర్‌గా నియమితుడైన వసీం ఖాన్ మాట్లాడుతూ.. "ఐసీసీలో చేరినందుకు గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అదే విధంగా మహిళల క్రికెట్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తాను" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment