
కరాచీ: ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ పయనమయ్యే పాకిస్తాన్ జట్టుతో... ఆటగాళ్ల కుటుంబాలు వెళ్లేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్, ఇతర ఆటగాళ్లు తమ వెంట భార్య, పిల్లలను కూడా తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరగా పాక్ బోర్డు వారి ప్రతిపాదనను ఖండించింది. ‘అవును ఆటగాళ్ల తమ వెంట కుటుంబాలను కూడా అనుమతించాలని కోరారు. కానీ బోర్డు దీనికి అంగీకరించలేదు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు వారి కుటుంబాలకు అనుమతి లభించినా, వరల్డ్ కప్ ప్రారంభమవగానే వారంతా తిరిగి ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కెప్టెన్ సర్ఫరాజ్ మాత్రం సుదీర్ఘ పర్యటనల్లో క్రికెటర్ల వెంట తమ కుటుంబీకులు ఉంటే బాగుంటుందని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment