'భారత్ ముక్కోణపు సిరీస్‌ ప్రతిపాదనకు ఒప్పుకోవద్దు' | khalid mahmood appeals to pakistan cricket, dont agree india's tri-series shedule | Sakshi
Sakshi News home page

'భారత్ ముక్కోణపు సిరీస్‌ ప్రతిపాదనకు ఒప్పుకోవద్దు'

Published Sun, Sep 15 2013 11:15 PM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

khalid mahmood appeals to pakistan cricket, dont agree india's tri-series shedule

కరాచీ: ఈ ఏడాది చివర్లో శ్రీలంకతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడదామని భారత్ చేస్తున్న ప్రతిపాదనను ఒప్పుకోవద్దని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ సలహా ఇచ్చారు. ప్రతి దానికి బీసీసీఐ వెంట మానుకోవాలని సూచించారు. ‘భారత్ ప్రతిపాదనను పీసీబీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దు. ఈ ముక్కోణపు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్వదేశంలో లంకతో సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎందుకంటే ముక్కోణపు సిరీస్ ఒక్క భారత్‌కే అనుకూలంగా ఉంటుంది. బీసీసీఐ ఏనాడూ పీసీబీకి మద్దతివ్వలేదు.

 

వాళ్ల ప్రయోజనం కోసమే మన సిరీస్‌ను సవరించేలా ప్రయత్నిస్తున్నారు’ అని మహమూద్ పేర్కొన్నారు. భారత్, లంక, పాక్ బోర్డులకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు శనివారం చెన్నైలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా డిసెంబర్‌లో ముక్కోణపు సిరీస్‌ను నిర్వహించే సాధ్యాసాధ్యాలపై చర్చించారు. వీలైనంత త్వరగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతామని భారత్ హామీ ఇస్తే ముక్కోణపు సిరీస్ ఆడేందుకు ఒప్పుకోవాలని సూచించారు. భారత్‌తో సుదీర్ఘ ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల పాక్ క్రికెట్‌కు లాభం చేకూరుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement