
పాకిస్తాన్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ ఆజంకు షాకిచ్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. తమ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్‌ను తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాబర్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.
మూడు ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ తీవ్ర నిరాశపరిచాడు. అంతేకాకుండా టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాక్ జట్టు సారథిగా తిరిగి మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆజం.. అక్కడ కూడా విఫలమయ్యాడు.
ఈ మెగా టోర్నీలో అతడి సారథ్యంలోని పాక్ జట్టు గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించింది. యూఎస్ఎ వంటి పసికూన చేతిలో ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే బాబర్‌పై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాక్ కెప్టెన్‌గా రిజ్వాన్..
అయితే బాబర్ స్ధానంలో పాక్ వైట్‌బాల్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను నియమించాలని పీసీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. పాక్ వైట్-బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఇప్పటికే ఈ విషయం గురించి పీసీబీతో చర్చలు జరిపినట్లు వినికిడి.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ పీసీబీ తమ నిర్ణయాన్ని ప్రకటించినున్న పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కాగా రిజ్వాన్ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రిజ్వాన్ వైపు పీసీబీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ENG vs SL: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. 147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే
Comments
Please login to add a commentAdd a comment