దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా గురువారం నుంచి మొదలు కానుంది.
ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(క్రిస్ట్‌మస్ తర్వాతి రోజు జరిగే మ్యాచ్) కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ తుది జట్టును ప్రకటించింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అక్టోబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బాబర్ చివరిసారిగా పాక్ తరపున ఆడాడు.
ఆ తర్వాత సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు పీసీబీ బాబర్‌ను పక్కన పెట్టింది. ఇప్పుడు మరోసారి అతడికి పాక్ క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. మరోవైపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేసిన అబ్దుల్లా షఫీక్‌పై పీసీబీ వేటు వేసింది.
అతడి స్దానంలోనే బాబర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా జరుగుతోంది.
తుది జట్లు
పాకిస్థాన్: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ముహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, ముహమ్మద్ అబ్బాస్.
దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్
చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment