
ఆసియా కప్-2025కు పాకిస్తాన్ జట్టులో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం చోటు దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న బాబర్ ఆజం.. తాజా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అభిమానులను అలరించాడు. శనివారం వరద బాధితులకు విరాళాలు సేకరించేందుకు పెషావర్ జల్మి, ఆల్-స్టార్ లెజెండ్స్ ఎలెవన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మికి ప్రాతినిథ్యం వహించిన బాబర్.. స్పిన్నర్‌గా సరికొత్త అవతారమెత్తాడు. స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్ యూనిస్ ఖాన్‌ను బాబర్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
మరొక పాక్ మాజీ టెస్టు బ్యాటర్ అజార్ అలీని కూడా బాబర్ పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో కూడా బాబర్ దుమ్ములేపాడు. కేవలం 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. అతడి బౌలింగ్, బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.
*_Younis khan out bowling Babar Azam_*#babarazam#PeshawarZalmi pic.twitter.com/PKq84Z7a2b
— Umar_multani (@umar_multani1) August 30, 2025
కాగా బాబర్ ఆజం పేరిట 7 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 12 లిస్ట్-ఎ వికెట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్-స్టార్ లెజెండ్స్‌పై 6 పరుగుల తేడాతో పెషావర్ జల్మి విజయం సాధించింది. పెషావర్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఆల్-స్టార్ లెజెండ్స్ టీమ్ ఛేదించలేకపోయింది. ఆల్-స్టార్ లెజెండ్స్ కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Babar Azam exhibition match me bhi clean bowled ho gyaa 😭 pic.twitter.com/Dk55hRxzAv
— Ankur (@cricwithpant2) August 30, 2025