బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ పాక్ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గులామ్.. 224 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన గులామ్.. చాలా బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
The Moments Kamran Ghulam completed his Hundred on Test Debut. 👏
He came as Babar Azam's replacement and when came to bat Pakistan were 19/2 & then he smashed Hundred - THE FUTURE OF PAKISTAN. ⭐pic.twitter.com/Z33V23vVgV— Tanuj Singh (@ImTanujSingh) October 15, 2024
అతడికి సైమ్ అయూబ్ (77) సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 86 ఓవర్ల అనంతరం ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (7), సైమ్ అయూబ్ (77), షాన్ మసూద్ (3), కమ్రాన్ గులామ్ (118), సౌద్ షకీల్ (4) ఔట్ కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (31), అఘా సల్మాన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.
చదవండి: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment