పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ జట్టు వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబర్.. ఇప్పుడు మరోసారి ఆ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆజం వెల్లడించాడు. ఇకపై తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టనున్నట్లు బాబర్ తెలిపాడు.
"పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. పాక్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కెప్టెన్సీ నుంచి తప్పుకుని నా వ్యక్తిగత ప్రదర్శలనపై దృష్టి సారించాల్సిన సమయం అసన్నమైంది.
కెప్టెన్సీతో నాకు చాలా అనుభవం వచ్చింది. కానీ అందువల్ల నాపై పనిభారం పెరిగింది. ఇక నా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనకుంటున్నాను. మిగిలిన సమయాన్ని నా కుటంబంతో గడపనున్నాను. నాకు కెప్టెన్‌గా అవకాశమిచ్చిన పీసీబీ ధన్యవాదాలు. ఈ విషయాన్ని పీసీబీ నెల రోజు క్రితమే తెలియజేశాను. ఇకపై ఒక ఆటగాడిగా జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించిందుకు ప్రయత్నిస్తాను" అని ఎక్స్‌లో ఆజం పేర్కొన్నాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర వైఫల్యంతో పాక్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. కానీ పీసీబీ మళ్లీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ముందు అతడికి జట్టు బాధ్యతలు అప్పగించింది. అక్కడ కూడా బాబర్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టి విమర్శల పాలైంది. దీంతో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపించాయి. అయితే పీసీబీ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అతడిని కొనసాగించాలని భావించింది. కానీ అంతలోనే బాబర్ తనంతట తనే కెప్టెన్సీని రాజీనామా చేయడం కొసమెరుపు. పాక్ కొత్త పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ చేపట్టే అవకాశముంది.
చదవండి: అశ్విన్‌కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment